బన్నీ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ మూవీ కరోనా వలన ఆగిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సినిమా గురించి వచ్చిన వార్తలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న  బన్నీ ఫ్యాన్స్ కోసం  మేకర్స్ కొద్దిసేపటి క్రితం వీడియో విడుదల చేసి రేపటి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని స్పష్టం చేశారు. వీడియోలో అల్లు అర్జున్‌కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

పుష్ప సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా బాలీవుడ్ స్టార్‌ని ఎంపికచ చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అభయారణ్యంలో తాజా షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాయకానాయికలు అల్లు అర్జున్‌, రష్మికమందన్నలతో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్లు సమాచారం. దాదాపు 60రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగనుందని తెలిసింది. కోవిడ్‌ పరంగా అత్యంత సురక్షితమైన రక్షణ చర్యల్ని తీసుకుంటూ ఈ షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంతో చిత్తూరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కథానాయిక రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్టు సమాచారం.