సర్వే నెం 71 ఇరిగేషన్ కాలవగట్టు అక్రమణపై మాకినీడి ఫైర్

  • కాలువ గట్టు కబ్జాయత్నంపై రణరంగం

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలంలోని వలస పాకల గ్రామంలో సర్వేనెంబర్ 71 ఇరిగేషన్ కాలువ గట్టుగా చెప్పుకుని స్థలాన్ని నల్లమిల్లి శేషారెడ్డి ఆక్రమణ చేస్తున్నారని, స్థానిక శాసనసభ్యుడు వత్తాసు పలుకుతున్నారని జనసేన పిఠాపురం ఇన్చార్జ్, కాకినాడ మాజీ కార్పొరేటర్ మాకినీడి శేషు కుమారి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలంలోని వలసపాకల గంగరాజు నగర్ రోడ్ 1లో సర్వే నెం. 71 ఇరిగేషన్ కాలవగట్టును ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని, ముందుగా స్కూలుకు సంబంధించిన బస్సులు పెడుతూ కప్పేడుతున్నామని స్థానిక ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని మాకినీడి శేషు కుమారి రణరంగం చేశారు. రెవెన్యూ అధికారులు కబ్జాలను నిలువురించడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను ఎవరూ కబ్జా చేయకూడదని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాకినీడి శేషు కుమారి మాట్లాడుతూ మా తాతయ్య మంచ్చేం గంగరాజు రిటైర్డ్ పోలీస్ అధికారిని 16 ఎకరాల భూస్వామి కావడంతో ఆనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలవ నిమిత్తం 8 కిలోమీటర్ల మేర భూమిని సేకరించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పూర్వికులు నుండి ఆ భూమి గంగరాజు వారసులుగా మాకు హక్కు కలిగి ఉండటం జరిగిందన్నారు. అయినప్పటికీ నేటి వరకు ఆ భూమిని కావాలని గాని పేద ప్రజలను ఖాళీ చేయమని గాని ఏనాడు కోరడం లేదని కానీ ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కాలువ గట్టు భూములను ఆక్రమణ చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ కాలవ గట్టు న్యాయస్థానంలో పెండింగ్లో ఉందని అయినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు అందరితో కబ్జాలు చేస్తున్నారన్నారు. గతంలో కూడా కాలువ గట్టు ఆక్రమించి ప్రహరీ నిర్మించిన నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మళ్లీ తిరిగి కాలువ గట్టుపై కన్నేసి పేద ప్రజల నివాసాలను తొలగించి కబ్జాకు యత్తనం చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన కాకినాడ రూరల్ శాసనసభ్యుడు ఫోన్ చేసి శేషారెడ్డికి అడ్డు తగలకండి అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కబ్జాల ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ చూసినా కబ్జాలు చేయడమే పాలనగా చేస్తున్నారన్నారు. కాలవ గట్టు పేద ప్రజల నివాసాలకు కాలనీ ప్రజల సామాజిక స్థలంగా భావించడం జరుగుతుందన్నారు. దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని శేషు కుమారి పేర్కొన్నారు.

ఆక్రమణలపై చర్యలు.. కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి రెవెన్యూ పరిధిలోని వలసపాకల గంగరాజు నగర్ 1లో సర్వేనెంబర్ 71 ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల తహసిల్దార్ వీరవల్లి మురార్జీ పేర్కొన్నారు. ఇరిగేషన్ కాలవగట్టు ఆక్రమణ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు నిలుపుదల చేయడం జరిగిందని, ఆక్రమలపై సర్వే చేసి ఎంత మేర జరిగిందో చూసి జిల్లా అధికారులకు విన్నవించడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.