ఇచ్చిన మాట నిలబెట్టుకొన్న సూర్య

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు నటుడు సూర్య ముందుకొచ్చారు. దక్షిణ సినీ కార్మికుల సమాఖ్యలోని కార్మికులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్లు డొనేషన్ అందజేశారు.

తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ ఓటీటీలో రానుందని చెప్పిన సూర్య… ఈ సినిమా బిజినెస్‌ ద్వారా వచ్చే రూ.5 కోట్లను కరోనా​ వ్యాప్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి అందిస్తానని సూర్య గతంలోనే హామి ఇచ్చారు. ఆయన ప్రకటించిన డొనేషన్‌లో ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా శుక్రవారం రూ. 1.5 కోట్లను.. భారతీరాజా ఫిల్మ్​ ఇనిస్టిట్యూట్​లో ఎఫ్​ఆఎఫ్​ఎస్​ఐ ప్రెసిడెంట్‌ ఆర్​కే సెల్వమణి, తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధిపతి కలైపులి ఎస్​ థానులకు సూర్య తండ్రి శివకుమార్​ అందజేశారు. అందులో సౌత్ సినీకార్మికుల సమాఖ్యకు కోటి రూపాయలు, తమిళ చిత్ర నిర్మాతల మండలికి రూ.30 లక్షలు, నడిగర్​ సంఘానికి రూ.20 లక్షలు చెక్​లను అందజేశారు.