స్వామీ నీ స్థానం వాలంటీర్ కి ఇస్తావా?

  • దేవతల వ్యవస్థ (వాలంటీర్)లో నీ కూతుర్ని కూర్చోబెడతావా?
  • మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించు
  • నీకు సలాం కొడతా
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి వైసిపి నాయకులు, వాలంటీర్లు ధర్నాకు ప్రతిస్పందనగా అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వాలంటీర్లను దేవత వ్యవస్థగా వర్ణించారు. నీ స్థానం వాలంటీర్ లకు ఇచ్చి, దేవతల వ్యవస్థలోకి నీ కూతుర్ని కూర్చో పెడతావా..? అని సవాల్ విసిరారు. నేను నీతిపరుడ్ని, నిజాయితీపరున్ని, నేను ధర్మ రాజుని అని ప్రగల్బాలు పలికే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటే మహిళ లేదా మగవాలంటీర్లలో ఒకరికి ఎమ్మెల్యే స్థాయి కల్పించాలని, 2024 ఎన్నికల్లో వారిలో ఒకరినే నిలబెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం లోపు ఒక శుభవార్త నియోజకవర్గ ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని తెలిపారు. ఎంతోమంది డిగ్రీ, పీజీలు లు చేసిన వారి భవిష్యత్తు వాలంటీర్ దగ్గర ఆగిపోకూడదని, అసాంఘిక శక్తులకు పావులు కాకూడదని, అదే పవన్ కళ్యాణ్ అంతరంగమని తెలిపారు. వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు వైస్సార్సీపార్టీ ప్రభుత్వం నాశనం చేస్తున్నది. వైసీపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయల వేతనం ఇచ్చి పెట్టి చాకిరీ చేయించుకుంటుందని, నాలుగు ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా ఐదువేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనంచేస్తుందని తెలిపారు. అదేవిధంగా వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హతలో నాలుగు యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేస్తున్నది వైసీపీయేనని, ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తు, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది వైసీపీ నాయకులు మాత్రమే నని, మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి ఐదు వేల దగ్గరే ఉంచింది కూడా వైసీపీయేనని, వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదని, వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా? అని దుయ్య బట్టారు. వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేసి మీ ప్రాంతంలో ప్రజలను మీ చేత భయపెట్టిస్తున్నరా లేదా? ఆలోచించండి గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలలో వృద్ధి లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వపు అణచివేత ధోరణిని అర్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, వెంకట ముని, మండల కార్యదర్శి మహేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చామంతి సురేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, కార్వేటి నగర్ ప్రధాన కార్యదర్శి హరీష్, పచ్చికాపల్లం బూత్ కన్వీనర్ ముని, గంగాధర్ నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు వెంకటాద్రి, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, కార్వేటి నగరం టౌన్ కమిటీ కార్యదర్శి మనీ, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, జనసైనికులు పాల్గొన్నారు.