టక్ జగదీష్ ఫస్ట్‌లుక్‌

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని క్రిస్మస్ కానుకగా విడుదల చేశారు . ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని వెనుక నుండి కత్తి తీయడం అందరిలో అంచనాలు పెంచుతుంది. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో నాని కనిపించి సందడి చేయనున్నాడు. టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తెలుస్తుండగా, ఇందులో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.