Sarvepalli: గిరిజనుల సమస్యలు పట్టవా?

• అకాల వర్షాల భారిన పడిన వారిని ఆదుకోవాలి
• సర్వేపల్లి జనసేన నాయకుల డిమాండ్

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో అకాల వర్షాలు గిరిజనులను రోడ్డున పడేశాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టిన కాలనీలు స్లాబులు సైతం దెబ్బతిని నీరుగారుతూ ఉన్నాయి. వర్షాలు కురుస్తుంటే ఎప్పుడు ఊడి మీద పడతాయో అర్ధంకాని పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సోమవారం స్థానిక నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు గిరిజన కాలనీల్లో పర్యటించి వారి సమస్యలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. గిరిజనుల సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించకపోగా, బెదిరిస్తున్నారని గిరిజనులు వాపోయినట్టు తెలిపారు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పార్టీలు ఉపయోగించుకుంటున్నాయన్న ఆయన దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటాచలం మండలం. లింగంగుంటలోని గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవి కుమార్, శ్రీ వంశీ, శ్రీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.