వర్కౌట్స్ స్టార్ట్ చేసిన తారక్, చరణ్

కరోనా మహమ్మారి కారణంగా ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ పూర్తిగా నిలిచి పోయాయి. లాక్ డౌన్ తర్వాత జూన్ నుండి షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా కూడా ఒకటి రెండు సినిమాలు మినహా ఎక్కువ శాతం షూటింగ్ ప్రారంభం కాలేదు. కరోనా భయంతో ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న స్టార్స్ ఇక బయటకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఈ నెలలో చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు కూడా ప్రారంభం అయ్యాయి.

ఎట్టకేలకు ఈ నెల నుండి మీడియం రేంజ్ హీరోలు పెద్ద హీరోలు సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే నెల రెండవ లేదా మూడవ వారం నుండి షూటింగ్ తిరిగి  ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. రెండు వారాల క్రితమే దర్శకుడు రాజమౌళి హీరోలు ఇద్దరికి కూడా అక్టోబర్ లో షూటింగ్ కు వెళ్దాం.. మునుపటి వెయిట్ మరియు ఫిజిక్ తో రెడీగా ఉండండి అంటూ చెప్పాడట. లాక్ డౌన్ లో వర్కౌట్స్ విషయంలో కాస్త అలసత్వం చూపించిన హీరోలు ఇద్దరు మళ్లీ ఇప్పుడు కష్టపడుతున్నారు. అక్టోబర్ మొదటి వారం వరకు పూర్తి ఫిట్ గా జక్కన్న ముందు ఇద్దరు హీరోలు కూడా నిల్చునే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరుగబోతున్న షెడ్యూల్ లో ఇద్దరు హీరోలతో పాటు అజయ్ దేవగన్ మరియు ముఖ్య తారాగణంపై చిత్రీకరణ జరుపబోతున్నారు.

సినిమాను తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. జక్కన్న సినిమా షూటింగ్ అంటే వందల మంది ఉంటారు. కాని కరోనా టైం కారణంగా సగంకు పైగా తక్కువగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాను చకచక పూర్తి చేసి వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.