తారకరత్న “దేవినేని” మోషన్ పోస్టర్ రిలీజ్

నందమూరి తారకరత్న కొంతకాలం గ్యాప్ తరువాత స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవినేని’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ ను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ లేబ్లో రిలీజ్ చేశారు. ఎన్నాళ్లగానో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తారక్ కు ఈ చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

 కాగా ‘దేవినేని’ సినిమా ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బెజవాడకు చెందిన ఇద్దరు నేత మధ్య స్నేహం, రాజకీయ కక్ష్యల నేపథ్యంలో వారి మధ్య ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూపించనున్నారు. వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు.