నార్పలలో ఘనంగా టి.సి వరుణ్ జన్మదిన వేడుకలు

సింగనమల: నార్పల జనసేన ఆధ్వర్యంలో జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి.సి వరుణ్ జన్మదిన వేడుకలు నార్పల శ్రీ సత్యసాయి అనాధ ఆశ్రమం నందు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పిల్లలతో కలసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టడం జరిగింది. టీసి వరుణ్ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ పార్టీ భలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నందుకు మండల నాయకులు ధన్యవాదాలు తెలియచేసారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశ్రమ పిల్లలతో కలసి ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, కలువాయి విశ్వనాధ్ రెడ్డి, నడిమిదొడ్డి శివయ్య, పొన్న తోట రామయ్య, కుమ్మరి రమణయ్య, రాము, అశ్వర్థరెడ్డి, చరణ్ కుమార్, బాబు మండల జనసైనికులు పాల్గొన్నారు.