టిడిపి అభ్యర్థి అయితా బత్తుల, టిడిపి నేత మెట్లను కలిసిన కౌన్సిలర్

కోనసీమ జిల్లా, అమలాపురం: అమలాపురం అసెంబ్లీ ఎన్డీఏ కూటమితెలుగు దేశం అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును, టిడిపి నేత మెట్ల రమణ బాబులను ఆయన స్వగృహం వద్ద 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయ లక్ష్మి -వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. అమలాపురం నియోజకవర్గంలో టిడిపి జనసేన కూటమిలో భాగంగా ఆనందరావుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, 9 వార్డ్ జనసేన కౌన్సిలర్ గొల్లకోటి విజయలక్ష్మి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, గంధం శీను, లంకలపల్లి వీరేశ్వరరావు, మట్టపర్తి సాయిబాబు, మేకల బాబాజీ నల్ల మణికంఠ, గ్రంధి బాలాజీ 9వ వార్డ్ తెలుగుదేశం అధ్యక్షులు కుంచె రమేష్ తదితరులు పాల్గొన్నారు.