స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలి!

  • జనసేన, టీడీపి, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ముత్తుముల, శ్రీ అశోక్ రెడ్డి గారిని గెలిపించాలని బలంగా నిర్ణయించు కొన్న గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బలంగా నమ్మిన వ్యక్తిగా గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా నాయకులు, మండల నాయకులు పార్టీ కోసం పని చేస్తున్నారు. గత 5 నెలల క్రితం పార్టీ లోకి వచ్చిన ఆమంచి స్వాములు గారు ప్రకాశం జిల్లాలో కాపు సంఘం అధ్యక్షుడు అని చెప్పుకొని తిరిగే ఆమంచి స్వాములు గారు, కాపులను ఉద్దరిస్తాను, నాలాంటి నాయకుణ్ణి నమ్మండి, నా లాంటి నాయకుణ్ణి కాపాడు కొనండి అని చెపుతారు. చీరాల నియోజక వర్గంలో కొన్ని సందర్భాల్లో నేను తోపును అని చెప్పే మీరు చీరాల నియోజక వర్గంలో ఎన్.డి.ఏ కూటమి అభ్యర్ధి గెలుపునకు కృషి చేయగలరు అనీ కోరుచున్నాము. ఆమంచి గిద్దలూరు నియోజకవర్గంలో కాపులు మధ్య చిచ్చు పెడుతూ విభేదాలు సృష్టిస్తున్నారు. బలిజ కులం చెందిన మెజారిటీ నాయకులు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఓట్లు వేయడానికి సిద్దంగా వున్నారు. పొత్తు అని చెప్పి అన్ కండిషన్ గా బలిజలు ఓట్లు వేయడం వలన ఎన్నికల అనంతరం మీ పరిస్థితి కరివేపాకు లాగా అయిపోతుంది అని కులాన్ని రెచ్చ గొడుతున్నారు. జనసేన పార్టీ చేరిన 3 నెలలకే చీరాల నియోజక వర్గంలో ఇంఛార్జిగా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చినారు. ఇచ్చిన తరువాత పార్టీ కోసం ఏమి చేశారు. 2008 నుండి 15 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచే సాయిబాబు గారిని కాదని మీకు ఇంఛార్జి పదవి కావాలని కోరడం ఎంత వరకు సమంజసం?. గిద్దలూరు నియోజకవర్గంలో ఎంతో ప్రశాంత మైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అనంతరం అందరూ కలసి మెలసి వుంటారు. కానీ ఆమంచి రాజకీయ ఎదుగుదల కోసం కులాన్ని రెచ్చ గొడుతు పబ్బం గడుపు కావాలని చూస్తున్నారు. ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలని కోరుచున్నము. గిద్దలూరు నియోజక వర్గం నాకు అన్యాయం జరిగిందని మీరు అందరూ నాకు అండగా నిలబడాలని కోరడం సమంజసం కాదు, నాయకులను కార్యకర్తలను తప్పు దోవ పట్టించడం మంచిది కాదు, మీరు వ్యవహరించే విధానం వలన వైసిపి మేలు జరిగే విధంగా వుంది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్సులు కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, కంభం మండల అధ్యక్షులు తాడిసెట్టీ ప్రసాద్, బెస్తవారపేట మండల అధ్యక్షుడు ముంతల మధు సుదన్ రెడ్డి, అర్ధవీడు మండల అధ్యక్షులు కలగొట్ల అల్లురయ్య, రాచర్ల మండల అధ్యక్షులు అలిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు దమ్ము తిరుపాలు, తుమ్మలపల్లి లోకేష్, సంయుక్త కార్యదర్సులు వేము ప్రవీణ్, షేక్ హజ్మతుల్ల, మీనిగ నాగేశ్వర రావు, కార్యదర్సులు ఇల్లురీ అనిల్ కుమార్, గాజుల సురేష్, చట్టీ శ్రీను, శ్రీపతి కృష్ణయ్య, గుర్రాల రామకృష్ణ, పార్శ బాలయ్య, కోళ్ల రమణ, బీరల శంకర్, బాలరాజు, రంగయ్య, మాచర్ల వెంకట రెడ్డి, దేవసహయం, వి డాని, ముత్యాల సాయి, బండి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.