కందుకూరు నియోజకవర్గంలో గెలిచేది టీడీపీ – గెలిపించేది జనసేన

కందుకూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనలు మేరకు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ రావు, ఇనకొల్లు శ్రీనివాసులు, గుడ్లూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో తమ పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరిపారు. నియోజకవర్గస్థాయిలో విస్తృత పర్యటనలు జరిపి పలు మండలాల్లో భారీ చేరికలు తో పార్టీ బలోపేతం చేయడం జరిగింది. జనసేన శ్రేణుల్లో ఉత్సాహం చైతన్యం నింపి జోష్ పెంచడం జరిగింది. పలు మండలాల్లో జనసేన శ్రేణులతో ఆత్మీయ కలయికలు జరిపి స్థానిక టీడీపీ నాయకులను కూడా కలిసి కోఆర్డినేషన్ చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో వైకాపా వ్యతిరేక వర్గాలను స్థానిక టీడీపీ నాయకత్వంతో సమన్వయ పరిచే చర్యలు జనసేన తీసుకుంది. నివురుగప్పిన నిప్పులా జనసేన మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2019 ఎన్నికల జనసేన ఓటింగ్ కన్నా నేడు జనసేన ఓటింగ్ పదిరెట్లు పెరిగిన అంశం అందరికీ విదితమే. జనసేన ఓటు అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసి తక్కువ అంచనా వేస్తున్న వారికి రేపటి ఎన్నికల్లో ఫలితాలే కీలకం. పొత్తు ధర్మం ప్రకారం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భాస్కర్ రావు గారి ఆద్వర్యంలో నియోజకవర్గంలో ప్రతి జనసేన మద్దతుదారులకు మెగా అభిమానులకు అధినేత పవన్ కల్యాణ్ గారి నిర్ణయాన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల కార్యదర్శి కొణిదెన శ్రీనివాసులు, లింగసముద్రం మండల అధ్యక్షుడు అంగులూరి నరసింహం, పట్టణ అధ్యక్షుడు బింకం నాగేంద్ర, ఉన్నం వెంకటేశ్వరరావు, ఉలవపాడు మండల జనసేన నాయకులు షేక్ మహబూబ్ బాషా, వక్కలగడ్డ మణికంఠ, పవన్ కుమార్, కేసారపు లక్ష్మణ్, కుంచాల యశ్వంత్ ,బాలచందర్ నాయుడు, సురేంద్ర నాయుడు, వలేటివారిపాలెం మండల జనసేన నాయకులు పసుపులేటి గురుబ్రహ్మం, బీరకాయల బ్రహ్మయ్య, బొడ్డు దేవదాసు, కందుకూరు మండల నాయకులు కొచ్చెర్ల గోవింద స్వామి, సలీం, గంధం రామ్ తేజ, శీలం విశ్వేశ్వరరావు, గుడ్లూరు మండల జనసేన నాయకులు మూలగిరి శ్రీనివాస్, అన్నంగి చలపతి, అనిమిశెట్టి మాధవ రావు, ఆలా శివ, భైరవరపు రాజశేఖర్, షేక్ రహంతుల్లా, గౌడపేరు రమేష్, గౌడపేరు శివాజీ, గుండెమడుగుల భాస్కర్, పాటి మహేష్, సన్నిశెట్టి గిరి, సన్నిశెట్టి హరిబాబు, జాహ్నవి, ‌కొనికి రాజేష్, మద్దెల సాయి దీపక్, కొట్టే పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.