కొబ్బరి ఒలుపు కార్మికుల సంఘంతో టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు, జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, అప్పనరామునిలంక ఒలుపు కార్మికుల భవనం నందు కొబ్బరి ఒలుపు కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఒలుపు భవనం నందు ముఖాముఖి చర్చ జరిపి జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ తో టీ ఇచ్చి వారితో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఒలుపు కార్మికులు వారి ప్రధాన సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు గోదావరి జోన్ కోకన్వీనర్ పినిశెట్టి బుజ్జి, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు గుబ్బల సూర్యనారాయణ, జనసేన నాయకులు కొణతం నరసింహ రావు, ఉండపల్లి అంజి, గిడుగు శేఖర్, బొమ్మిడి ఏడుకొండలు, రాపాక మహేష్, జవ్వాది వెంకటరత్నం, మిరియాల బుజ్జి, రావూరి సత్యనారాయణ, రావూరి సూర్యనారాయణ, జవ్వాది శ్రీను, బర్రె అప్పన్న, గ్రామ పెద్దలు, గ్రామ శాఖ కార్యవర్గం, తదితరులు పాల్గొనడం జరిగింది.