ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ..

తిరుపతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. స్థానిక ఐఐటీ ప్రాంగణంలో నిర్వహించిన ఏపీ ఉన్నత విద్యామండలి సమావేశంలో ఆయన పాల్గన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. నూరుశాతం విద్యార్థులను ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నామని, ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి నుండి కంప్యూటర్‌ కోడింగ్‌పై తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ప్రవేశాలను కొనసాగిస్తున్నామని, ఈ ఏడాది 2.20 లక్షల మందికి ఆన్‌లైన్‌ దార్వా డిగ్రీలో ప్రవేశం కల్పించామన్నారు. వచ్చే ఏడాది నుండి ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.