తెలంగాణా ఎంసెట్ పరీక్ష తేదీలు

తెలంగాణా విద్యార్ధులకు ఎంసెట్ 2020 పరీక్షను ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో టీఎస్ ఎంసెట్ పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య ఒక సెషన్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రెండో సెషన్‌ను నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదు అనే కఠీన నియమాన్ని అందరూ గుర్తుంచుకోగలరు.