మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు ఓపెన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో బార్లు, కబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే వైన్‌ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెలల కాలం తర్వాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్‌ రూమ్‌లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్‌ ఈవెంట్స్‌, డ్యాన్స్‌లను నిషేధించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు పాటించని బార్లు, క్లబ్బులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బార్లలో. క్రమపద్ధతి పాటించాలి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు విధించింది.