ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ

విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులపై తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ దృష్టి సారించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, కోడింగ్‌ తదితర 10 కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్‌ టర్మ్‌ కోర్సులుగా వీటిని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌ నుంచే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, డాటాసైన్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కోడింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ, రోబోటిక్స్‌ వంటి కోర్సులను ప్రవేశ పెట్టనుంది.