ఏలూరులో ఉద్రిక్తత – జనసేన నేతల అరెస్టు

  • రాష్ట్ర టీడీపీ బంద్ కి సంఘీభావం తెలిపిన ఏలూరు జనసేన
  • శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

ఏలూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ జనసేన శ్రేణులు నియోజకవర్గంలో బందుని పాటించి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసనగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో మా ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నిరశనను తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశినరేష్ మండల అధ్యక్షులు వీరంకిపండు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, కుర్మా సరళ, ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు రెడ్డి గౌరీ శంకర్, నాయకులు బోండా రామునాయుడు, బుద్ధ నాగేశ్వరరావు, రాపర్తి సూర్యనారాయణ, వేముల బాలు, పడాల రాజు, సురేష్, పొన్నూరి రాము, నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు ఉన్నారు.