అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడు కాల్పులు: 6గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఇండియానా పోలీస్‌ లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు మృతిచెందారు. పుట్టబోయే బిడ్డతో సహా గర్భిణీ స్త్రీ చనిపోవడం అక్కడ తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మరో చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కాల్పులను ఇండియానా పోలిస్ మేయర్ జో హాగ్‌ సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. గత దశాబ్దకాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.