1 గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ షాప్ ప్రారంభించిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం, శుక్రవారం ఉదయం గొల్లప్రోలు పట్టణంలో మెయిన్ రోడ్ లో గల సాయిబాబా గుడి వద్ద పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా గొల్లప్రోలు జనసేన నాయకులు తలారి శ్రీనివాస్ గారి షాప్ శ్రీనివాస ‘1’ గ్రా: గోల్డ్ జ్యుయలరీ షాప్ అంగరంగా వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం రోజున మగువలకు అవసరమయ్యే వన్ గ్రామ్ జ్యువలరీ ప్రారంభించిడం చాలా ఆనందంగా ఉందని మరియు లక్ష్మి దేవి అనుగ్రహంతో వ్యాపారం మంచిగా జరగాలి అని తెలియజేసారు. అనంతరం ప్రత్యేకంగా తలారి శ్రీనివాస్ కి మరియు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, పిఠాపురం జనసేననాయకులు కడారి తమ్మయ్యనాయుడు, జ్యోతుల శ్రీనివాసు, బలిరెడ్డి గంగబాబు, మాదేపల్లి శ్రీనివాసు, గొల్లప్రోలు మండల జనసేన మహిళా అధ్యక్షురాలు వినుకొండ అమ్మాజీ, గొల్లపల్లి గంగబాబు, తలారి శ్రీను, కీర్తి చంటి, తలారి కామరాజు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు జాకెట్ ముక్కలను, గాజులను పంపిణీ చేసిన పిఠాపురం జనసేన

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండల పరిధిలో చేబ్రోలు గ్రామం తానా సెంటర్ నందు వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ మండపం నందు ప్రత్యేక కంకుమపూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కనకదుర్గ ఆలయ మండప కమిటీ వారు నాయకులు దమ్ము చిన్న, దమ్ము రాఘవమ్మ, పెంకె ఇంద్ర, పొలావరపు మోహన్ కూమార్, కొప్పిశెట్టి అప్పారావుల ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని మండపం వద్ద కుంకుమ పూజలు జరుపుకొనుచున్న మహిళా భక్తులకు జాకెట్ ముక్కలను, గాజులను పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన నాయకులు జ్యోతులశ్రీనివాసు మరియు చేబ్రోలు గ్రామజనసేన నాయకులు పంపిణీ చేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కుంకుమార్చనలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ అందరూ కూడా ఆనందంతో గడుపుతూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కనకదుర్గమ్మను కొరుచున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాస్, నక్కా బద్రి, కొడవలి నాగేశ్వరరావు, సూరిశెట్టి జయకృష్ణ, అల్లం దొరబాబు, బుద్దాల గంగాధర్, ఓరుగంటి చిన్న, ఓరుగంటి నాగేశ్వరరావు, ఉలవకాయలు వీరబాబు, మట్ల సత్తిబాబు, తేటకాయల వెంకట సత్తిబాబు, పెద్దింటి శివ తదితరులు పాల్గొన్నారు.

కొడవలి కనకదుర్గమ్మ దర్శించుకున్న పిఠాపురం జనసేన నాయకులు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల పరిధిలో కొడవలి గ్రామం నందు కనకదుర్గమ్మ వారి గుడిలోని భవాని మాల వేసుకున్న భవాని మాలధారులు మరియు కొడవలి గ్రామం జనసేన నాయకుల ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన సీనియర్ నాయకులు నల్లం వాసు కొడవలి కనకదుర్గమ్మ గుడిని సందర్శించి అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అమరాధి వల్లి రామకృష్ణ, కొడవలి జనసేన గ్రామనాయకులు నక్కా బద్రి, నక్కా నారాయణమూర్తి, కొత్త పాకల మన్నియ్య, కుక్కా శ్రీను, తండ్రి గారి అబ్బాయి, మద్దాల రామకృష్ణ, రెడ్నం సూరిబాబు, సైతని రమేష్ తదితరులు‌ పాల్గొన్నారు.

శ్రీ కనకదుర్గమ్మ అన్నసంతర్పణలో పాల్గొన్న జ్యోతుల

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల పరిధిలో దుర్గాడ గ్రామం సరిబాటవీదిలో వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ మండపం నందు అన్నసంతర్పణ కార్యక్రమానికి కనకదుర్గ ఆలయ మండప కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం దుర్గమ్మ అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేడిబోయిన సత్యనారాయణ, కుర్రు నంది, రావుల రమణ, నేమాల కన్నయ్య, నాగళ్ళ కామరాజు, పసగడుగుల శ్రీను, పసగడుగుల నాగు, గిడుతూరి నానాజీ తదితరులు పాల్గొన్నారు.