2వ దశ వారాహి యాత్ర విజయవంతం కావాలి

  • రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వారాహి 2వ దశ యాత్ర ప్రారంభంఅవుతున్న సంధర్బంగా ఎటువంటి అటంకాలు జరగకుండా దిగ్విజయంగా సాగాలి అని ఈ అవినీతి, అరాచక పరిపాలన అంతమొంది జనసేన ప్రభుత్వం రాబోవు ఎన్నికలలో ఏర్పడాలని శ్రీ వీరాంజనేయ స్వామి గుడిలో రాజంపేట జనసేన నాయకులు వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎమ్ వెంకటేశ్వర రావు, ఉమ్మడి కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కె సుబ్బరాయుడు, రాజంపేట 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వీరయ్య ఆచారి, రాజంపేట జనసేన సీనియర్ నాయకులు రామా శ్రీనివాసులు, శంకరా, మలిశెట్టి మోహనా క్రిష్ణ, కాపు సంక్షేమ నాయకులు అభిగారి గోపాల్, భువనగిరిపల్లి జనసేన నాయకులు ఎంపిటీసీ అభ్యర్థి కోలాటం హరి, సురేంద్ర, నందలూరు జనసేన నాయకులు సాయిరుద్ర రాజు, కుమ్మరపల్లి సాయి, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటి కార్యనిర్వాహక సభ్యులు గురివిగారి వాసు తదితర జనసైనికులు పాల్గొన్నారు.