వ్యవసాయ అధికారుల తీరు బాధాకరం: జయరాం రెడ్డి

  • రైతుల్ని చిత్తశుద్ధితో ఆదుకోవాలి

అనంతపురం: అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరించడం వలన రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొన్ని మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందే దానికోసమో? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వలనో? అనంతపురం ఉమ్మడి జిల్లాలో కరువు” తక్కువగా ఉందని చెప్పే క్రమంలో” భాగంగా వ్యవసాయ అధికారుల ప్రవర్తన తీరు బాధాకరం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జయరాం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం అనంతపురం ఉమ్మడి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వలన.. చేన్లలో చెనక్కాయ, కంది లాంటి పంటలన్నీ నిట్ట నిలువైన ఎండిపోయి రైతులు పూర్తిగా నష్టపోయినారు. మరోవైపు బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసే రైతులకు సకాలంలో కరెంటు ఇవ్వకపోవడం వలన పగులు కేవలం గంట.. అరగంట కరెంటు ఇచ్చి, రాత్రిపూట ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక రైతులు అయోమయ పరిస్థితిలో పూర్తిగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా గాని కరువు తక్కువగా ఉందనే చెప్పే క్రమంలో.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దురదృష్టపురం, బాధాకరం. రైతుల పట్ల వైసిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు, రోజు ఎక్కడో ఒకచోట దుర్భిక్షం, కరువు కాటకాల వలన రైతులు దిక్కు తెలియని పరిస్థితులలో భవిష్యత్తు మీద ఆశ లేక, వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ రైతుల్ని, రాష్ట్రప్రజలను మోసం చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవాలని దురుద్దేశంతో ప్రతిపక్ష నాయకులు పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న క్రమంలో.. కనీసం 10% శాతం వంతు… రాష్ట్ర ప్రజానీకం గురించి కానీ, రైతులు గురించి కానీ చిత్తశుద్ధితో ఆలోచించేసి ఉంటే రాష్ట్రంలో ఈ దారుణమైన పరిస్థితులు నెలకొనేటివి కాదు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి తగిన నివేదికలు సిద్ధం చేసి, అనంతపురం ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతుల్ని చిత్తశుద్ధితో ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాని జయరాం రెడ్డి తెలిపారు.