మూసీనది పరీవాహక ప్రజలకు మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మూసీ నది నుంచి వస్తున్న భారీ వరద హిమాయత్‌సాగర్‌లోకి చేరుతోంది. ఈ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ఈ ఉదయం ఆరు గంటల సమయానికి 1762 అడుగులకు చేరుకుని నిండుకుండను తలపిస్తోంది. హిమాయత్‌సాగర్‌లోకి ఇంకా 1666 క్యూసెక్కుల నీరు వస్తోంది.

 దీనికితోడు రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, జలాశయంలోకి వరదనీరు రాక ఇలాగే కొనసాగితే సాగర్ గేట్లు ఎత్తేసి నీటిని కిందికి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.