తోటకూర అనిల్ ను పరామర్శించిన గాదె

చిలకలూరిపేట నియోజకవర్గం, మురికిపూడి గ్రామ జనసేన పార్టీ నాయకులు తోటకూర అనిల్ అనారోగ్యం కారణంగా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్ ని అడిగి తెలుసుకొని, చిలకలూరిపేట జనసేన పార్టీ తరపున వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ సుభాని, శిఖా బాలు, చట్టాల త్రినాద్, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, చిలకలూరిపేట మండల అధ్యక్షులు ఖాదర్ బాషా, లీలా కిషోర్, సాంబ, సూర్య, పగడాల వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.