దివ్యాంగుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్న ముఖ్యమంత్రి

కాకినాడ సిటి: కాకినాడ జనసేన పార్టి కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పత్రికావిలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమవేశంలో ముత్తా శశిధర్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆటాడుకుందాం ఆంధ్రా అని ఆటాడిస్తూ తాను మాత్రం దివ్యాంగులతో వారిజీవితాలతో ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారన్నారు. ప్రపంచం మొత్తం తమ బాధ్యతగా దివ్యాంగులను గౌరవించుకుంటూ వారిని ప్రోత్సాహించడానికి ఏకంగా పారా ఒలెంపిక్స్ సైతం నిర్వహిస్తుండగా, మన పక్కరాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకారం వెంటనే తన తొలి సంతకం ఒక దివ్యాంగురాల ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ చేయడం ఇలా ఎన్నో చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులకి మేలు చేయడం కాదుకదా కనీసం జాలి చూపిచడం లేదన్నారు. నేడు ఒక దిగ్బ్రాంతికరమైన విషయం తన దృష్టికి వచ్చిందనీ, అది ప్రపంచానికి తెలియాలన్న సదుద్దేశంతో ఈ విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేసానన్నారు. ఎడ్యుకేషన్ హబ్, పెన్షనర్స్ పేరడైజ్ లాంటి రకరకాల పేర్లతో కాకినాడని పిలుస్తారనీ అలాంటి మన కాకినాడలో పదివేల జనాభా ఉన్న ఏటిమొగలో సుమారు 200ల కుటుంబాలలో దివ్యాంగులు ఉన్నారన్న విషయం చాలా విచారకమమనీ, సరైన అవగాహన లేక టీకాలను పొందక ఈపరిస్థితి వచ్చిందనీ, అది మేము చేసుకున్న పాపమా అని నేడు అక్కడి దివ్యాంగులు బాధపడుతున్నారనీ దీనికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలన్నారు. లోగడ దివ్యాంగుల వివాహం జరిగిన వెంటనే జిల్లా కలక్టరు వారి నుండీ రూ. లక్షా యాభైవేల రూపాయలు మనీ ఆర్డరు ద్వార వచ్చేదనీ, కానీ నేడు వై.సి.పి ప్రభుత్వం వచ్చాకా వధూ వరులు ఇద్దరూ పదవ తరగతి చదివి ఉండాలన్న నిబంధనతో ఒక్క కలంపోటుతో అనర్హులమైపొయామని వారు బాధపడుతున్నారనీ అసలు పెళ్ళిళ్ళు కష్టమైన రోజుల్లో చదువుకున్నవాళ్ళే అవ్వాలంటే తమని నిర్భందంగా & నిర్ద్వందంగా ఒంటరిజీవితం గడపమని తమ నుదిటమీద ఈ వై.సి.పి ప్రభుత్వం శిలాశాసనాన్ని రాసిందన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ వారిని అనునయించి జనసేన పార్టీ తరపున తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి చొరవతో మీకు రాబోయే తమ ఉమ్మడి ప్రభుత్వంలో దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చేస్తాననీ అంతే కాకుండా దివ్యాంగులకు నగరానికి దూరంగా చొల్లంగి, కొమరిగిరిలో కాకుండా నగరంలోనే ఇళ్ళు ఇప్పిస్తాననీ లేదా అపార్ట్మెంటు అయితే గ్రౌండ్ ఫ్లోర్ లోనే కేటాఇంచేలా చర్యలు చేపట్టేలా చేస్తానన్నారు. వారిలో ఉత్సాహవంతులకి సబ్సిడీతో ఋణాలు మంజూరు చేపించి ఉపాధి పొందేలా సహాయపడతానని అధైర్యపడకుండా ఒక మూడు నెలలు ఓపిక పట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఐక్య దివ్యాంగుల జిల్లా సమాఖ్య అధ్యక్షులు కర్రి ఆదినారాయణ, దివ్యాంగులు బలసాడి ఆదిబాబు, ఓలేటి శివశంకర్, మల్లాడి ఏసుబాబు, చింతా ఏసు, కర్రి శ్రీనివాస్, గంగాధర్, గదల స్వామి, తలాడి సూరిబాబు, సంగాడి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.