ఇప్పటం నుంచే ప్రభుత్వంపై సమర శంఖం

ఇప్పటంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖారావం పూరిస్తారని కుప్పం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తెలియజేసారు.

కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ వెంకటరమణ కుప్పం నందు శనివారం నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులతో సమావేశమై వారికి ఈ నెల 14 వ తేదీన గుంటూరు లో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గురించి దిశానిర్థేశం చేయడం జరిగింది.

ఈ సమావేశం ద్వారా నియోజకవర్గంలోని ప్రతియొక్క జనసైనికునికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొనాలని ఇన్ ఛార్జ్ ఆహ్వానం పలకడం జరిగింది.

ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ తో పాటు, చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శి వేణు, రాష్ట్ర మత్య్స కార వికాస విభాగం సభ్యులు వామనమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త హరి, మండల అధ్యక్షులు సుధాకర్, ప్రవీణ్, హరీష్, కిషోర్, చంద్రు మరియు అమీర్ లతో పాటు మండల కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.