వంతెన నిర్మాణం చేపట్టాలి: రామ శ్రీనివాస్ డిమాండ్

రాజంపేట: బవనగిరిపల్లికి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్ధం తక్షణమే ఎత్తైన వంతెన నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఊటుకూరు2 పంచాయతీ పరిధిలో బవనగిరిపల్లి గ్రామంలో సుమారు రెండు వేల మంది జనాభా అక్కడ నివాసం ఉంటున్నారు, అదేవిధంగా రాజంపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అధిక సంఖ్యలో భక్తులు భారీగా నిరంతరం రవాణా చేస్తూంటారు. బవనగిరిపల్లి సమీపంలో ఉన్న వంతెన సమస్యలను స్థానిక పాలకులు, అధికారులు గుర్తించాలి. తేలికపాటి వర్షానికే ఒక వైపు చెరువు, ఇంకో వైపు పులంగి ఏరు, ఇరువైపులా వంతెన వద్ద వర్షపు నీరు అధికంగా చేరి గుడికి, అక్కడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ, ప్రస్తుతం కొనసాగుతున్న రాజంపేటకు సంబంధించి శాసనసభ సభ్యుడు మెడ వెంకట మల్లికార్జున రెడ్డి, లోకసభ సభ్యుడు పెదిరెడ్డి మిథున్ రెడ్డి వారికేమో ఎలక్షన్లు వస్తే అక్కడ ప్రజలు ఓట్లు కోసం వాగ్దానాలు చేసినవి, హామీలు పలికినవి వారు వేసిన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా అందలమెక్కిన తర్వాత అక్కడ గ్రామస్థుల సమస్యలు మాత్రం పట్టనట్లు, గిట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శిస్తూ హెచరిక జారి చేశారు.. స్థానిక పాలకులు, సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణ నిధులు మంజూరు చేసి, ఎతైన వంతెన నిర్మాణ మరమ్మతులు వెంటనే చేపట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు, జనసైనికులు పాల్గొన్నారు.