కూలిన మిగ్‌-29కే విమానం..

భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-29కే యుద్ధ విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో విమనాంలో ఇద్దరు పైలట్లుఉన్నారు. విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలిందనీ, ఆ సమయంలో ఇద్దరు పైలట్లూ బయట పడ్డారనీ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక పైలట్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారనీ, మరో పైలట్ గల్లంతయ్యారనీ పేర్కొంది. గల్లంతైన పైలట్ కోసం నేవీ అధికారులు వెతుకుతున్నారు.

రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి బయల్దేరిన మిగ్‌-29కే విమానం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అరేబియా సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు.