వైసీపీ అంతం ఆంధ్ర ప్రజల పంతం

  • కొత్తూరు గ్రామంలో జనసేనలో భారీ చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జి.మాడుగుల మండలం నుర్మాతి కొత్తూరు గ్రామంలో గురువారం గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్దఎత్తున జనసేనపార్టీలో చేరారు. వారందరికీ అరకు పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య జనసేనపార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఇంతవరకూ మా గ్రామాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకులు సందర్శించిన దాఖలాలు లేవు? మా సమస్య గోడు వినే నాధులు లేరు! రారు ! మొట్ట మొదటిసారిగా జనసేనపార్టీ నుంచి పాడేరు అరకుపార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మా సమస్యలు వినడానికి మా గ్రామానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే అధికారం చేపడితే మా కుటుంబం మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే అధికారం చేపట్టాలనుకునే పార్టీల వ్యవహరశైలితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, అందుకు మా గ్రామం కూడా మినహాయింపు కాదు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు, శ్రామిక, నిరుద్యోగం ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉంది. మేము నిస్వార్ధంగా రాజకీయాలు నడపగల వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని బలంగా నమ్ముతున్నాం. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీకే పట్టం కడతాం అందుకు బలంగా పనిచేస్తామని తెలిపారు. డా.వంపూరు గంగులయ్య మాట్లాడుతూ మార్పుకోసం ఇలా ఒక గ్రామం మొత్తం ప్రజానీకం సిద్ధమవ్వడం భవిష్యత్తులో రాబోయే రాజకీయ ప్రక్షాళనకు మార్పుగా భావించాల్సి ఉంటుందని మీకు తెలుసు. విపరీత పోకడలకు పోతున్న వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే ప్రజా హింసకె ఎక్కువ మొగ్గు చూపుతుందని నిస్వార్ధపు రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ విలువైన ప్రజా సమయం వృధా చేస్తున్నారని, ఉద్యోగాలు అన్నారు నేటికి ఆ మాట కంటి తుడుపు చర్యగానే మిగిలిందని, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయని ప్రజల ఆలోచన తీరు నిజాయితీ వైపు పయనిస్తోందని ఈ మధ్య ప్రజలలో ఒక స్లోగన్ బాగా నానుతోంది అది ఏమిటంటే “వైసీపీ అంతం ఆంధ్ర ప్రజల పంతం” అంటు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మంచినీటి సమస్య, అంగన్ వాడి భవనం లేదని, డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు, మసాడి భీమన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అని రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. యూత్ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ ఒక ఉద్యమ నేపధ్యం ఉన్న నేత మన ఇన్చార్జ్ గంగులయ్య ఒక విప్లవాత్మక రాజకీయం ఆరంభించిన మహానేత పవన్ కళ్యాణ్ కలిసి మనమందరు ప్రయాణిస్తే గెలుపు మనదే మార్పు కొరకు తొలి అడుగు మనదే అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తెరవడా వెంకట రమణ, జి మాడుగుల నాయకులు తల్లే త్రీమూర్తులు, తల్లే కృష్ణ మూర్తి, పెద్దలు పండన్న, సోమన్న, కిముడు నాగేశ్వరరావు, గ్రామస్తులు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.