ఘనంగా రాజానగరం మండల జనసేన కార్యాలయం శంకుస్థాపన

  • బత్తుల దంపతులచే ఘనంగా మండల జనసేన కార్యాలయానికి మొదలైన పనులు..
  • శరవేగంగా నిర్మాణం జరుపుకోనున్న రాజానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం..
  • యుద్ధప్రాతిపదికన.. 15 నుండి 20 రోజుల్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న పార్టీ కార్యాలయం…

రాజానగరం నియోజకవర్గఒ, రాజానగరం మండలం, రాజానగరం హైవే ఆనుకుని జిఎస్ఎల్ హెచ్.పి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న స్థలములో రాజానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో, వారి చేతులమీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేదపండితులు నిర్వహించారు.. సర్వాంగ సుందరంగా, అత్యాధునిక వసతులతో కేవలం 15 నుండి 20 రోజుల్లోనే జనసేన కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అందుబాటులో వచ్చే విధంగా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇకనుంచి జనశ్రేణులకు ఎటువంటి కార్యక్రమాలు జరిగినా.. నాయకులు ఎటువంటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడ నుండే సమీక్షలు జరుగుతాయి.. ఈ జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన పూజ కార్యక్రమం అనంతరం బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్లడానికి.. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరచడానికి.. జనశ్రేణులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాజానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేసుకోవడం శుభసూచకమని.. ఈరోజు అత్యంత పవిత్రమైన పర్వదినం అని తెలియజేస్తూ… కార్యకర్తలకు, నాయకులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఇకనుంచి ఈ కార్యాలయం నుండే సమీక్షించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని.. మండలంలోని గ్రామాల్లో జనసేన పార్టీని ఎలా బలపరచాలని దాని గురించి ఇక్కడ నుంచే ప్రణాళికలు తయారు చేస్తామని, మండలంలో ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ కార్యాలయంలో సంప్రదించాలని… ఇది 24×7 ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి… 2024లో తిరుగులేనిశక్తిగా ఆవిర్భవించి.. రాబోవు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరాం, సూర్యాపేట ఎంపీటీసీ వల్లభశెట్టి వెంకటరమణ (డబ్బు) సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీను, అడ్డాల శ్రీను, గెడ్డం కృష్ణయ్య చౌదరి, స్టాలిన్, నాగారపు సత్తిబాబు, చిట్టిప్రోలు సత్తిబాబు, ఆనందాల గోవింద్, కురుమళ్ళ మహేష్, తోరాటి శ్రీను, గంగిశెట్టి రాజేంద్ర, సంగుల రమేష్, కానవరం సతీష్, సూర్య, తోట అనిల్ వాసు, ముక్కపాటి గోపాలం, అడబాల ఆదివిష్ణు, అడబాల బాబి, బచ్చు సుభాష్, గండి జయసుధ, ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.