రైతులను అదుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు మీడియా సమావేశంలో గాదె

సత్తెనపల్లిలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించడం జరీగంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ప్రభుత్వ సోమ్ముతో ఎన్నికల ప్రచారం చేస్తోందని, అంబటికి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ రూపం కనబడుతోందని, నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టి రాంబాబుకి తాను చేస్తున్న శాఖపై అవగాహన లేదు కేవలం మట్టి తవ్వకోవటం, భూములు అక్రమణ కోసమే అంబటికి మంత్రి పదవి ఉందని, మంత్రి అంబటిపై చెప్పులు విసిరే రోజు దగ్గరలో ఉందని తెలియజేశారు. రైతులను అదుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఈ రాష్ట్రం ఎడారిగా మారింది. రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. మురుగు నీటిపై ఆధారపడి రైతులు పంట సాగు చేసుకునే పరిస్థితి. మంత్రి అంబటి మానసిక స్థితి సారిగాలేదు. సాగర్ కుడికాలువకు వేంటనే నీరు విడుదల చేయాలి. పొలాలు ఎండి పోతే మట్టి తవ్వుకునే అలోచనలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారని తెలియజేశారు. నాగార్జున సాగర్ నుంచి గుక్కెడు నీరు తెచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పంటలకు సాగునీరు ను విడుదల చేయకపోతే దర్నా చేస్తాం అని జనసేన జిల్లా అధ్యక్షుడు తెలియజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో చేస్తున్న సంకల్ప యాత్రపై ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కేవలం కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న కార్యక్రమంగానే మేము చూస్తున్నామని తెలియజేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిపై ఖచ్చితంగా పార్టీ అధిష్టానం త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. సత్తెనపల్లి జనసేనలో రెండు వర్గాలు లేవు అందరూ ఒకటి గానే ఉన్నారని తెలియజేశారు. ఈ యొక్క పత్రికా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమలశెట్టి మల్లేశ్వరి, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి అంచుల అనీష్, నకరికల్లు ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, బాధినీడు సుబ్బారావు, నాగూర్ వలి, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, బత్తుల ఆంజనేయులు, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.