అగ్రహారంలో డ్రైనేజీ, వాటర్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించాలని జనసేన వినతి

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవార, పొన్నలూరు ఎంపిడిఓ కల్పనకి అగ్రహారం పంచాయతీలో సమస్యలు పరిష్కరించండని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అగ్రహారం పంచాయతీలో సైడ్ కాలువలు లేకపోవడం వల్ల నీరు నిల్వ ఉండి ప్రజలకు వ్యాధులు వ్యాపించి అనారోగ్యానికి గురి అవుతున్నారు, త్రాగునీటి సమస్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది, వాటర్ ప్లాంట్ ఉండి కూడా నిరూపయోగంగా ఉంది, గతంలో పంచాయతీ కార్యదర్శికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైసిపి నాయకులు ఇటువంటి ప్రజా సమస్యలను చూస్తూ కూడా పట్టి పట్టనట్టుగా ఉండి నిద్రపోతున్నారు. వెంటనే డ్రైనేజీ మరియు వాటర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలని ఎంపిడిఓకి పొన్నలూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు కర్ణ తిరుమలరెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.