ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట పరిహారం చెల్లించాలి

శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఆకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించి, పంట నష్టాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హరి ప్రసాద్ తో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పరిశీలించడం జరిగింది. నాలుగు మండలాలలోని పంట నష్టం అయిన ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో జరిగిన నష్టం గురించి తెలుసుకోవడం జరిగింది. దాదాపు రైతులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట నాలుగు మండలాలలో దాదాపు 35 వేల నుండి 40 వేల ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్టు తెలియజేశారు. చేతికి వచ్చిన పంట వర్షం కారణంగా నేలకొరగడం రైతుకి తీవ్ర నష్టాన్ని కల్గించి కన్నీళ్లు తెప్పించిందని తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఏ మాత్రం రైతులకి జరిగిన నష్టాన్ని అంచనా వెయ్యడానికి గ్రామాల్లో పర్యటించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి నష్ట పోయిన ప్రతి గింజకి పరిహారం చెల్లించాలని తెలిపారు. రైతుల అంచనా మేరకు నష్ట పోయిన ఎకరాకు కనీసం 30-40 వేల రూపాయలు నష్ట పరిహారం అందిస్తే కనీసం పెట్టుబడి, కూలి ఖర్చులను బర్తి చేసి, కష్టాల నుండి బయట పడచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన నష్టాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నష్ట పరిహారం అందేలా జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, నాయకులు ఆనంద్, గిరీష్, వెంకట రమణ, రైతులు పాల్గొన్నారు.