మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

నెల్లిమర్ల, జిల్లాలో మిచౌంగ్ తుఫాను వలన రబి పంట నీటి మునిగి రైతులు కన్నీళ్లు కార్చుతున్నారు. కనుక విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు కౌలురైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. అలాగే తడిసిన మొలకెత్తిన రంగు మారిన ధాన్యమున కొనుగోలు నిబంధన సడలించి మద్దతు ధరకే కొనగలరు మరియు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి రైతులకు విత్తనాలు పెట్టుబడి రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన కౌలు రైతులకు ఎకరాకు 30000 మరియు వాణిజ్య పంటలకునష్టపోయిన కవులు రైతులను ఎకరాకు 30000 మరియు వాణిజ్య పంటలకు ఎకరాకి 50,000 ఇచ్చి కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. నెల్లిమర్ల నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పంటలు అరటి మరియు వాణిజ్య పంటలు నీటి మునిగి తీవ్ర నష్టపోయిన రైతులకు నేటి వరకు అధికారులు ఎటువంటి భరోసా ఇవ్వలెని పరిస్థితి ఇప్పటికైనా కౌలు రైతులను రైతులను ప్రభుత్వం ఆదుకొని విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.