వైఎస్సార్సీపీ దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి రుజువైంది

సత్యవేడు, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారన్న కారణంతో జనసేన పార్టీకి చెందిన 8 మంది అందులో 7 మంది దళితులు ఒకరు బలహీన వర్గానికి చెందిన వారిపై కక్షతో అధికార పార్టీ వారి సూచనలతో 5 సంవత్సారాలు శిక్షలుపడే సెక్షన్లు పెట్టి మూడు రోజులుగా వారిని జైలులో ఉంచిన ప్రభుత్వం ఇది. ఇదేనా దళితులపై చూపే ప్రేమ. వివరాలలోనికి వెళ్ళగా.. గురువారం ఉమ్మడి చిత్తూర్ జిల్లా వరదయ్య పాళ్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినందుకు అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించబడి సత్యవేడు సబ్ జైలులో రిమాండ్ లో ఉంచబడిన జనసేన పార్టీకి చెందిన 8 మందిని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు, కార్యకర్తలు శ్రీధర్, సాగర్ యోగేష్, రాజేష్, రెడ్డి శేఖర్, జయకుమార్ లను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డా. కత్తి మమత, న్యాయవాది, డా.మాసి కృష్ణమూర్తి న్యాయవాది, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన క్రియాశీలక కార్యకర్తలు, బలిజ పల్లి ఈశ్వర్ రాయల్, నాగలాపురం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ చిరంజీవి యాదవ్, శేఖర్, తులశీరామ్, వెంకటేష్, మునిరత్నమ్మ, కేశవులు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.