అంగన్వాడిలపై ప్రభుత్వం మొండి వైఖరి తక్షణమే విడనాడాలి

గురజాల: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ప్రభుత్వం మొండి వైఖరి తక్షణమే విడనాడాలని పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా తెలియచేసారు. పిడుగురాళ్ల మండలంలో పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం సరైన పద్ధతి కాదని
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజున వారిని ఇబ్బంది పెట్టడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు నామమాత్రపు వేతనాలకే పని చేస్తున్నారని. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుటీని వీరికి వర్తింప చేసి నెలకు 26 వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలన్నారు, అంగన్వాడీల పోరాటానికి జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, బేతంచర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరావు, కంభంపాటి ముక్కంటి, బేతంచర్ల నాగేశ్వరరావు, జెస్సి, కొమిరిశెట్టి సతీష్ మొదలు వారు పాల్గొన్నారు.