ఎమ్మెల్యే, చైర్ పర్సన్ ల ఆధిపత్య పోరు అభివృద్ధికి శాపం

మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరీగంది. ఈ మీడియా సమావేశంలో గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లెలో ఎమ్మెల్యే, చైర్ పర్సన్ ల ఆధిపత్య పోరు అభివృద్ధికి శాపంగా మారిందని కౌన్సిల్ సమావేశాలు రద్దు కావడంతో ఎమ్మెల్యే, చైర్ పర్సన్ ల ఆదిపత్య పోరుకు నిదర్శనమని దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి మదనపల్లి ప్రజల సమస్యలను తీర్చకుపోతే జనసేన, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా తీసుకుని ఎవరికీ ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ, అందరిని కలుపుకొని మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి తోడ్పాడాలని అన్నారు. అలాగే తిరుపతిలో రోజా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ నీ ఆదాయం పైన సిబిఐ విచారణ చేయించుకుంటా‌ అని‌ అడగగలవా నీకు ఖరీదైన కార్లు, విల్లాలు ఎక్కడి నుండి వచ్చాయి. పవన్ కళ్యాణ్ భార్య, భువనేశ్వరమ్మలను జైలుకు పంపిస్తానని కారుకూతలు కూయడం ఎంత వరకు సమంజసం అని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, చంద్రశేఖర, గడ్డం లక్ష్మిపతి, జంగాల గౌతమ్, జయ, శంకర, విజయ్ కుమార్, గంగులప్ప, లవన్న, జనార్దన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.