రాజధాని ఎక్కడ ఉండాలనేది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశమే తేల్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తోన్న రాజధాని వికేంద్రీకరణ అంశంపై కాదుఅంటూనే కేంద్రం జోక్యం చేసుకుంటున్నదనిపిస్తోంది, రాజధాని ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే అంశమే అని బీజేపీ నేతలు చెబుతున్నదానికి, వాస్తవ పరిస్థితికి సంబందమే లేదు… జరుగుతోన్న పరిణామాలను బట్టి ఈ విషయం నిజమనిపిస్తోంది.

ఏపీలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది, మండలిలో తిరస్కరణు గురై, నిర్ణీత గడువు ముగియడంతో గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ చేరాయి. శాసన ప్రక్రియలో భాగంగా ఆ బిల్లుల్ని న్యాయశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం పున:పరిశీలన తర్వాత తిరిగి గవర్నర్ వద్దకు చేరాయి. బిల్లులపై గవర్నర్ న్యాయసలహా తీసుకుంటారా? లేక ఉన్నవిదంగా ఆమోదిస్తారా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. వీటిపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం.. గవర్నర్ ను ఆరా తీసినట్లు ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్టు చేశాయి.

ఆంధ్రప్రదేశ్ లో పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అలాగే సీఆర్డిఏ రద్దు బిల్లు.. తదితర అంశాలపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగంతి తెలిసిందే. వాటిపై గురువారం జరిగిన విచారణలో హైకోర్టు అనూహ్య వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నదానికి విరుద్ధంగా.. ‘‘రాజధాని ఎక్కడ ఉండాలనేది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశమే”అని హైకోర్టు పేర్కొంది. తాను విచారిస్తోన్న పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు.. విచారణను వాయిదా వేసింది.