పాఠశాలలో హైస్కూల్ సెక్షన్ ని పునరుద్దరించాలి

నాడు-నేడు అభివృద్ధి పనుల పరిశీలనలో జనసేన నాయకులు

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం క్షేత్రస్థాయి పరిశీలన గురువారం దవులూరి త్రిలోక శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంబమూర్తినగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలోని నగరపాలక సంస్థ పాఠశాలని సందర్శించారు. అక్కడున్న స్థానికులు శశిధర్ తో మాట్లాడుతూ ఈ స్కూలులోని హైస్కూల్ సెక్షన్ ని రేచర్లపేటలోని స్కూలులో విలీనం చేసారని వాపోయారు. తామంతా వివిధ వృత్తులపై ఆధరపడే వారమని, అంతదూరంలోని స్కూల్ కి పిల్లలని పంపడం కష్టమని, అలా అని ప్రయివేటు స్కూళ్ళలో జాయిన్ చేయడం తమకు భారమని, కాబట్టి ఈ స్కూలులో హైస్కూల్ సెక్షన్ మళ్ళీ తెరిపించాలని విన్నవించుకుంటే, జనసేన పార్టీ శ్రేణులు నిరసన చేపట్టి ఆప్రాంత ప్రజల వద్ద ఈ స్కూలు హైస్కూల్ సెక్షన్ పునరుద్ధరించాలన్న వినతిపత్రాలపై సంతకాల సేరణ చేపట్టారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ గత కొన్ని రోజులుగా తాను జనసైనికులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ నాడు-నేడు కార్యక్రమం పరిశీలన చేపడుతుంటే విస్తుగొలిపేలాంటి నిజాలు ఎదురవుతున్నాయన్నారు. ఎక్కడైనా, ఎవరైనా కార్యకలాపాలను విస్తరించుకుంటూ వెళతారనీ, ఇక్కడ వై.సి.పి ప్రభుత్వం ఎన్నో ఏండ్లనుండీ నిర్వహింపబడుతున్న స్కూళ్ళను వివిధ కారణాలతో కుంటిసాకులు చూపుతూ.. మూసివేయడం, ఇంకో దూరమైన స్కూలులో విలీనం చేయడం చేస్తూ విద్యావ్యవస్థని తిరోగమించేలా చర్యలు చేపట్టడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి లోపభూఇష్ఠమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని జనసేన పార్టీ విద్యార్ధుల తరపున ప్రతిఘటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, సిటీ వైస్ ప్రెసిడెంట్లు అడబాల సత్యనారాయణ, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మాజీ కార్పోరేటర్ ర్యాలీ రాంబాబు, సిటి కమిటీ నాయకులు సమీర్, ముత్యాల దుర్గాప్రసాద్, వార్డు అధ్యక్షులు మనోహర్లాల్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, నాయకులు మోస ఏసుబాబు, తోట కుమార్, వెంకటేశ్వర్లు, దారపు సతీష్, చీకట్ల వాసు, కలపరెడ్డి రాజు, అగ్రహారపు సతీష్, వీరమహిళలు జయలక్ష్మి, రధిక, లక్ష్మీ దేవి, రజియా తదితరులు పాల్గొన్నారు.