కొడవలి తురకలకొండ బాధితరైతుకు అండగా జనసేన పార్టీ ఉంటుంది!!

  • జనసేన పార్టీతో కొడవలి మైనింగ్ మాఫియాను అరికడదాం.. కలిసి పోరాడుదాం బి.ఎస్.పి పార్టీ
  • పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, కొడవలి గ్రామంలో గల తురకలకొండ సర్వే నెంబర్ 133/1 నందు గల కొండపోడు బాదితరైతుకు పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, బి.ఎస్.పి పార్టీ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రమణ్యం, పిఠాపురం బి.ఎస్.పి పార్టీ ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, జనసేన నాయకులు కలిసి కొడవలి గ్రామంలో గల తురకల కొండపైన సుమారు‌ 370 యకరాల భూమిలో రైతులు జీడిమామిడి తోటలు పండించుకొనుచూ ఉపాధి పొందుతున్నారు అటువంటి కొండపైన మైనింగ్ పేరుతో మైనింగ్ మాఫియా తురకల కొండను ఆక్రమించుకునే ఉద్దేశంతో ఉన్నారని వారికి ప్రభుత్వపెద్దల సహకారంతో రెవిన్యూశాఖ వారు తగు అక్రమంగా ఎన్.ఓ.సీ లు ఇచ్చియున్నారని, మైనింగ్ శాఖ వారు అనుమతులు లభించాయని కొంతమంది మైనింగ్ మాఫియాసభ్యులు చెప్పుకొంటు దందాను చేస్తున్నారని, అక్రమంగా ప్రభుత్వఅనుమతులు గాని ఇతర అనుమతులు గాని లేకుండా ప్రభుత్వం స్థలమైన తురకలకొండ వద్దకు రహదారిని నిర్మిస్తున్నారని తురకల కొండపైన అక్రమ మైనింగ్ నిమిత్తం రైతులు 2 దావాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)నందు వేయడం జరిగిందని సదరు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వపెద్దలు, రెవిన్యూ అధికారుల సహకారంతో మైనింగ్ మాఫియా వారు అక్రమంగా రోడ్డు నిర్మించి, ఏ విధమైన అనుమతులు లేకుండా ఆక్రమంగా మైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని కొడవలి కొండపై మైనింగ్ జరిగితే సుమారు 300 రైతుల కుటుంబాలు నిరాశ్రయులవుతారని దీని కారణంగా రైతులు ఆర్దికంగా తీవ్రనష్టం చవిచూడవలసి వస్తుందని రైతులు మాకినీడి శేషు కుమారి గారి వద్ద వాపోయారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజవర్గ జనసేన ఇంచార్జ్ బాధితరైతులతో మాట్లాడుతూ.. రైతులకు నష్టం జరగకుండా జనసేనపార్టీ తరపున తగిన సహయసకారాలు అందిస్తాని కొడవలి తురకలకొండ రైతు బాధితులకు 2023 మే 2వ తేదీన రావటం జరిగింది. రైతులకు అవసరమైతే ఇక్కడ కూర్చుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా రైతులు నష్టపోకుండా పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. అవసరమైతే నేను బాధితరైతులకు మద్దతుగా రైతులతో కలిసి ఉద్యమించడం జరుగుతుందని‌ బాధిత రైతుకమిటి వారికి తగు భరోసాను ఇచ్చారు. ఈ విషయం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి కలిసి కొడవలి రైతుల సమస్యను ఆయనకు తెలియజేస్తానని అదేవిధంగా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ గారికి పీఏసీ చైర్మన్ శ్రీనాదెండ్ల మనోహర్ గారికి, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి, రాష్ట్ర పీఏసీ సభ్యులకి తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, జనసేన నాయకులు వెన్నపు చక్రధర్ రావు, పిఠాపురం టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దుర్గ, మర్రి దొరబాబు, నక్క నారాయణమూర్తి, పెద్దింటి శివ, వెలుగుల లక్ష్మణ్, ఉమ్మడి బోడకొండ, సామినిడి అప్పారావు, స్వామిరెడ్డి సుబ్రమణ్యం, కొడవలి బాధితరైతు కమిటీ సభ్యులు నక్క శ్రీను(బద్రి), గంపల రాంబాబు, నరాల సుబ్రహ్మణ్యం, అమజాలపు నానాజీ,
శ్రీనుబాబు, శివ, త్రిమూర్తులు, వంశీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.