విద్యుత్ కోతలు కొనసాగితే ప్రతి సబ్ స్టేషన్ ముందు జనసేన పార్టీ ధర్నా చేపడుతుంది

రాష్ట్రాన్ని అప్రకటిత విద్యుత్ కోతలతో అంధకారంలో ముంచుతున్న వైయస్సార్సీపి ప్రభుత్వం బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ కోతలతో ప్రజలకు చాలా ఆందోళన కలిగించింది. ఈ విషయమై అధికారులును అడిగితే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అని చెప్తున్నారు.. కానీ ఎన్ని గంటలో చెప్పలేకపోతున్నారు. వేసవి సమీపించక ముందే ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటే, రానున్న వేసవిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారో అనే భయం ప్రజల్లోకి వచ్చేసింది. కావున వెంటనే ప్రత్యామ్నాయం చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్తు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే విధంగా విద్యుత్ కోతలు కొనసాగితే ప్రతి సబ్ స్టేషన్ ముందు జనసేన పార్టీ ధర్నాకు దిగుతుందని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్నిరాజు హెచ్చరించారు.