అన్న సంతర్పణలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం, గణపతి నవరాత్రులు అనంతరం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్న పాల్గొనడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం తానా సెంటర్ వీధిలో మహాన్నదాన కార్యక్రమాన్ని వినాయకుని నవరాత్రుల మండప కమిటి వారు గురువారం నాడు మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినాయక నవరాత్రుల కమిటీ వారు, జనసేన నాయకుల ఆహ్వానం మేరకు ముఖ్యాతిధిగా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు అన్నసంతర్పణ వడ్డన కార్యక్రమంలో పాల్గొని వినాయకుని దర్శించుకొని అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అల్లం దొరబాబు, దమ్ము చిన్నా, దిబ్బడి సురేష్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.