2021లో ప్రారంభంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో కరోనావైరస్ టీకా కోసం అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు బాగా కష్టపడుతున్నాయి. అమెరికా, భారత్ వంటి దేశాలు టీకా తయారీ విషయంలో, పంపిణీ విషయంలో ప్రణాళికలు వేస్తున్నాయి. అదే సమయంలో భారత దేశ  ప్రజలకు వచ్చే ఏడాది ఆరంభంలోనే దేశంలో కరోనా వైరస్‌కు టీకా వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు.

కనీసం ఒకటి కన్నా ఎక్కువ కంపెనీల నుంచే ఈ టీకాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను ఎలా పంపిణీ చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను నిపుణులు తయారు చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. టీకాలను ముందుగా ఎవరికి ఇవ్వాలి, టీకాలను భద్రపరిచేందుకు కోల్ట్ చైన్ ఫెసిలిటీలను బలోపేతం చేస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ప్రస్తుతం నాలుగు సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో 2021లో ప్రారంభంలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని తెలిపిన మంత్రి.. ఒక కంపెనీ వల్ల మొత్తం దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు.