మోదీ దూరదృష్టికి నిదర్శనం కొత్త పార్లమెంటు భవన డిజైన్

ప్రధాని మోదీ దూరదృష్టికి నిదర్శనంగా కొత్త పార్లమెంటు భవన డిజైన్‌ ఉందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. గురువారం ఆమె పార్లమెంటు భవనం(సెంట్రల్‌ విస్టా) శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కొత్త ఆకాంక్షలు నెరవేర్చేలా పార్లమెంటు భవనం ఉండనుందని.. ప్రజాస్వామ్య ఆదర్శాలను బలోపేతం చేస్తుంద ని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా. ఢిల్లీలో గురువారం జరిగిన నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాలు పంచుకున్నారు.