మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గం అనుసరణీయం

అస్పృశ్యత నిర్మూలన… సామాజిక న్యాయం… మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో శ్లాఘించారు. శతాబ్దాల నాడే అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన ఆయన మార్గం అనుసరణీయం. సామాజిక విప్లవం, న్యాయం సాధించాలనుకొనే వారు తప్పనిసరిగా జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్ర చదవాలి. ఫూలే జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాను. సమన్యాయ సత్యశోధకులైన మహాత్మా ఫూలే చెప్పిన మాటలను వల్లె వేయడం కాకుండా- వాటిని ఆచరించి చూపించడం, జనసేన పార్టీ విధివిధానాల్లో భాగమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.