పొన్నలూరు ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి.. జనసేన రాస్తారోకో

  • నిద్రపోతున్న వైసిపి ప్రభుత్వం మేలుకోవాలి
  • యాక్సిడెంట్లు జరగకుండా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి
  • పొన్నలూరు మండలం ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది

కొండెపి: పొన్నలూరు మండలంలోని పొన్నలూరు నుండి కామేపల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారిని మరమ్మత్తులు చేయాలని జనసేన పార్టీ నుండి మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మనోజ్ కుమార్మాట్లాడుతూ ఈ ప్రధాన రహదారి నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది, కామేపల్లిలో ఉన్నటువంటి పోలేరమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులు ఈ రహదారిలో వెళ్లాల్సి వస్తుంది, అదేవిధంగా కొండేపి, ఉప్పలదిన్నె, రావులకొల్లు, కామేపల్లి, పచ్చవ, వెళ్లాలంటే ఈ రహదారిలోని ప్రయాణించాలి, ఈ రహదారి పరిస్థితి అద్వానంగా మారిపోయింది, గుంతలమయంగా తయారయింది, నిత్యం ఈ రహదారిలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పొన్నలూరు మండల ప్రజలు మాత్రం జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు మాత్రం వెయ్యమని కరాకండిగా గట్టిగా చెబుతున్నారు, రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వానికి పొన్నలూరు మండల ప్రజలు బుద్ధి చెబుతామని అంటున్నారు, పొన్నలూరు నుండి కామేపల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారిని అతి తొందర్లో మరమ్మత్తులు చేసి, నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము, పొన్నలూరు మండల ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిల్లిపోగు పీటర్, దొరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, కర్ణ తిరుమల్ రెడ్డి, ఖాజావలి, భాష, సుంకేశ్వరం శ్రీను, అంజి, ఆంజనేయులు, ప్రవీణ్, ఆనంద్, రాజేష్, నవీన్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.