రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, అమిత్‌ షా

రాష్ట్రపత్తి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ 75వ పడిలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు గొప్ప అంతర్దృష్టి ఉందని, జాతికి రాష్ట్రపతి కోవింద్‌ గొప్ప ఆస్తి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంకితభావంతో ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని తెలిపారు. పేదల సాధికారతకు అంకితభావంతో పనిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ 1945 అక్టోబర్‌ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా పరాంఖ్‌ ప్రాంతంలో జన్మించారు. 2017 జూలై 25న ఆయన భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.