ఎర్రకోటపై జెండా ఆవిష్కరించి సమస్త భారతానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

దేశ రాజధాని డిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఎపుడు జరిగేలా కాకుండా ఈ ఏడాది తక్కువమంది అతిధులతో స్వాతంత్ర్య దినోత్సవ జరిగాయి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది కేవలం 150 మంది వీఐపీలకు మాత్రమే. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించి తదనంతరం ప్రధానిమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి… స్వాతంత్ర్యం కోసం అమరులైన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు ప్రధాని మోదీ. సరిహద్దులో ఉన్న సైనికులకు మరియు దేశంలోని పోలీసులకు వందనం చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో

యుద్దం చేస్తుందని… ఈ మహమ్మారితో జరుగుతున్న యుద్దంలో మనమందరం విజయం సాధించాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

కరోనాతో ప్రస్తుతం ముందుండి పోరాటం చేస్తున్న వైద్యుల సేవలు మరువలేనివని… ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఒక పక్క కరోనాతో యుద్ధo చేస్తుంటే పలు రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ఈ పరిస్థితులను చక్కదిద్దేoదుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 74 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణ త్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం సాధించారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.