యావత్ భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

72వ గణతంత్ర దినోత్సవంతో భారతావని పులకించిపోతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.

గణతంత్ర వేడుకలకు ఇతర దేశాధినేతలు అతిథులుగా రావటం పరిపాటి. అయితే ఈసారి మాత్రం రిపబ్లిక్​ డే అతిథి లేకుండానే జరగనుంది. 72వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే రెండో గణతంత్ర వేడుకల్లో ఈసారి అతిథులు ఎవరూ హాజరుకావడం లేదు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ను తొలుత ఆహ్వానించినప్పటికీ.. యూకేలో కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది.​