నాడు-నేడు పధకం సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలి: ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ సూచనల మేరకు ఆయన నాయకత్వంలో ముందుగా ప్రకటించిన విధంగా సిటిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలన కొరకు ముందుకు సాగింది. ఈ సందర్భంగా గాంధీనగరం, ఎల్విన్ పేటలోని ఇదివరకటి మునిసిపల్ స్కూలుని మూసివేసి అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించడాన్ని గుర్తించారు. దీనితో ఈ ప్రాంతంలో పిల్లలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం పైగా కానీ ప్రాధమిక విద్యని పొందలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ముత్తా శశిధర్ మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం తాము ఆహ్వానిస్తున్నామని కానీ దీనికి ప్రతిగా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి తొలిమెట్టుగా ఉపయోగపడే ప్రాధమిక విధ్యాలయాన్ని మూసివేయడం హర్షనీయం కాదని ఖండించారు. ఒకనాడు కాకినాడని జిల్లాలోనే విద్యా కేంద్రంగా ప్రముఖంగా చెప్పుకునేవారని కానీ నేడు అందుకు భిన్నంగా వాస్థవ పరిస్థితులు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ పరిశీలనలో ఇదే విధంగా పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఇదివరలొ నిర్వహింపబడిన స్కూల్స్ మూసివేసారని దీనికి కారణం తగిన సంఖ్యలో విద్య్హార్ధులు లేకపోవడం అని చెపుతున్నారనీ, మరి వై.సి.పి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న నాడు-నేడు పధకం సాధించిన ప్రగతి ఏంటో ప్రజలకు ఈ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు. సమాజం అభివృధి చెందడానికి ప్రాధమిక విద్య చాలా అవసరమని ఈ వై.సి.పి ప్రభుత్వం మూసివేసిన స్కూళ్ళను రాబోతున్న విద్యాసంవత్సరంలో బడులు తెరిచేలోగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానికుల నుండీ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎల్విన్ పేట పరిధిలోని స్కూళ్ళను ఆకుల శ్రీనివాస్ & ముమ్మిడి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శులు తలాటం సత్య, అట్ల సత్యనారాయణ ఐటీ సెల్ వరప్రసాద్, సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు, సిటి నాయకులు వరదా దొరబాబు, ముత్యాల దుర్గాప్రసాద్, జనసైనికులు కుమార్, సతీష్, భగవాన్, చీకట్ల వాసు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.